1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (11:36 IST)

శాకుంతలం పై నాగచైతన్య, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌పై ఆరోహిరావు కామెంట్లు

Arohirao comments
Arohirao comments
ఈమధ్య కొంతమంది సెలబ్రిటీలు ఫేమ్‌లో వచ్చాక సినిమాల గురించి విశ్లేషిస్తున్నారు. ఓ న్యూస్‌ ఛానల్‌లో పనిచేసే ఆరోహిరావు బిగ్‌బాస్‌ 6 సీజన్‌లో పాల్గొంది. ఇటీవల కొన్ని సినిమాలకు రివ్యూలు ఇస్తూ సోషల్‌ మీడియాలో చెప్పేస్తుంది. అయితే సినిమా విడుదలయిన వెంటనే కాకుండా ఆ తర్వాత ఆమె తన విశ్లేషణకు కారణం చెబుతూ కొన్ని విషయాలు వెల్లడించింది. శాకుంతలం పై  మాట్లాడుతూ, సమంత బాగానే పాత్రలో ఇమిడింది. కానీ నాగచైతన్య ఫ్యాన్స్‌కు ఆమె నచ్చలేదు. అంటూ తప్పంతా వారిదే అన్నట్లు చెప్పింది.
 
సినిమా లాగ్‌ వుందనీ,  పురాణం కథ కనుక విజువల్స్‌, గ్రాఫిక్స్‌ తగిన స్థాయిలో లేవని చెప్పింది. ఇక బేబి ఆర్హ పాత్ర బాగాచేసింది. కానీ, బయట చాలామంది అవకాశాలు లేకుండా వున్నారే వారికి ఇస్తే బాగుండేదని చెప్పింది. దర్శకుడి పనితనం కానీ సినిమా ఎందుకు తీశారని విశ్లేషించకుండా సింపుల్‌గా రాసేసింది. అటు నాగచైతన్య, ఇటు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ నుద్దేశించి అన్నట్లు ఆమె భావన వుంది. సినిమా హిట్‌ చేయాలని ఇరు హీరోల ఫ్యాన్స్‌ చూస్తే సరిపోతుందిగదా అన్నట్లుగా ఆమె భావన వున్నట్లు కనిపిస్తోంది. మరి దీనికి వారి అభిమానులు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి. లేదా! పోయిన సినిమాకు ఎందుకు సందడి అని ఊరుకుంటారేమో చూడాలి.