శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (19:36 IST)

దుబాయ్‌లో రాహుల్ సిప్లగింజ్‌తో ఆషూ రెడ్డి- ఫోటోలు, వీడియో వైరల్

Ashu Reddy
Ashu Reddy
ప్రముఖ గాయకుడు మరియు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తన తదుపరి సింగిల్ కోసం దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటున్నాడు. అతని బెస్టి ఆషు రెడ్డి కూడా దుబాయ్‌లో పండగ చేసుకుంటోంది. 
 
ఈ మేరకు దుబాయ్‌లో ఆషు- రాహుల్ అపార్ట్‌మెంట్ నుండి తీసిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా స్నేహితుడి గొప్పతనాన్ని తెలుపుతూ క్యాప్షన్ ఇచ్చిన అషురెడ్డి #friendsforever అంటూ పేర్కొంది. 
 
కాగా, రాహుల్ తన తదుపరి మ్యూజిక్ వీడియో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. విదేశాల్లో ఇది అతని మొట్టమొదటి మ్యూజిక్ వీడియో షూట్.
 
మరోవైపు, ఆశు తన ఇతర స్నేహితులతో కలిసి తనకు ఇష్టమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటైన దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటోంది. 
 
కాగా నాగార్జున అక్కినేని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో వీరిద్దరూ పాల్గొన్నారు. ఆషూ మధ్యలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగా, రాహుల్ షోలో విజయం సాధించాడు. ఈ షో ద్వారా వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)