శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (10:14 IST)

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అందాలభామ అసిన్...

ప్రముఖ నటి అసిన్, రాహుల్ శర్మ దంపతులకు పండంటి పాప జన్మించింది. ఈనెల 26తో 31వ వసంతంలోకి అడుగుపెడుతున్న అసిన్‌ తనకు ఇది గొప్ప బర్త్‌డే గిఫ్ట్ అని ట్వీట్ చేశారు.

ప్రముఖ నటి అసిన్, రాహుల్ శర్మ దంపతులకు పండంటి పాప జన్మించింది. ఈనెల 26తో 31వ వసంతంలోకి అడుగుపెడుతున్న అసిన్‌ తనకు ఇది గొప్ప బర్త్‌డే గిఫ్ట్ అని ట్వీట్ చేశారు. తమకు పాప జన్మించినట్టు రాహుల్, అసిన్‌లు మీడియాకు తెలిపారు. గత యేడాది మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మను నటి అసిన్ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. 
 
తమ ఇంట్లోకి కొత్తగా మరో వ్యక్తి రావడంపై రాహుల్ శర్మ మాట్లాడుతూ, గడిచిన తొమ్మిది నెలలు తమ జీవితంలో చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తమ వెంట నిలిచి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.
 
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గజినీ’ సినిమా రీమేక్‌తో అసిన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ  సినిమాలో ఆమీర్‌ఖాన్‌తో కలిసి నటించింది. తెలుగులో రవితేజ సరసన ‘అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలో నటించింది. గతేడాది జనవరి 19న రాహుల్ శర్మను వివాహం చేసుకుంది.