శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 21 జనవరి 2020 (20:50 IST)

అల్లు అరవింద్‌కి చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ పురస్కారం

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన చాంపియన్స్‌ ఆఫ్‌ చేజ్‌ పురస్కారం వచ్చింది. మాజీ రాష్ట్రపతి మాన్యశ్రీ ప్రణబ్‌ ముఖర్జీ గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని దేశరాజధాని ఢిల్లీలో అల్లు అరవింద్‌ స్వీకరించారు. 

గీతా ఆర్ట్స్‌ అధినేతగా జాతీయ స్థాయిలో అనేక చిత్రాలు నిర్మించడమే కాకుండా, అల్లు కళాపీఠం ద్వారా పలు సామాజిక సేవాకార్యక్రమాల్ని నిర్వహిస్తున్న  అల్లు అరవింద్‌‌కు 
ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఓపక్క ఇటీవలే అల్లు అరవింద్‌ నిర్మించిన 'అల వైకుంఠపురములో...' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయకేతనం ఎగురవేస్తున్న నేపధ్యంలో ఆయనకి ఈ పురస్కారం లభించడం పట్ల అఖిల భారత చిరంజీవి యువత హర్షం వ్యక్తం చేస్తోంది.