1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (17:53 IST)

వారు నా బలానికి మూలస్తంభాలు అంటున్న ప్రశాంత్ వర్మ

Prashant Varma
Prashant Varma
అ- సినిమా ప్రపంచంలోకి నా మొదటి సాహసం, ఇంత దూరం రావడానికి నాకు ధైర్యాన్ని ఇచ్చింది అని దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అ సినిమా ఆరేళ్ళ ప్రయాణం సందర్భంగా ఆయన ఈ పోస్ట్ పెట్టారు. అ అనే సింగ్ లెటర్ తో టైటిల్ ఏమిటి? అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక సినిమా తర్వాత సినిమా సరికొత్తగా వుందని టాక్ తెచ్చుకుంది.
 
వర్మ స్పందన ఎలా వుందంటే, అపారమైన కృతజ్ఞతతో, ​​నాని, ప్రశాంతి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు నా బలానికి మూలస్తంభాలు. మీ నమ్మకం, మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు. నా తారాగణం, సిబ్బంది అంతులేని విశ్వాసం కోసం మరియు మొదటి నుండి నాకు అండగా నిలిచి నన్ను విశ్వసించినందుకు కృతజ్ఞతలు, మీ ప్రేమ మరియు ప్రోత్సాహం అఖండమైనది అంటూ పేర్కొన్నారు.
 
కాజల్ అగర్వాల్, రెజీనాకసాండ్రా, ఈషా, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్,  రోహిణిమొల్లేటి, మురళీశర్మ, దేవదర్శిని తదితరులు నటించారు.