బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (09:40 IST)

పుష్ప 2 కు పోటీగా సంకెళ్ళు తెంచుకుని మరీ వస్తున్న నానీస్ సరిపోదా శనివారం

pupsha-saripoda
pupsha-saripoda
ఇటీవలే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాను 2024 ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా హీరో నాని కూడా  సరిపోదా శనివారం చిత్రాన్ని అదే రోజు విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్ టైన్ మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఇదిహాట్ టాపిక్ గా ఇండస్ట్రీలో మారింది. నాని సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
 
ఇక పుష్ప 2 కూడా షూటింగ్ జరుపుకుంటున్నా దర్శకుడు సుకుమార్ టేకింగ్ కు రెండు సినిమాల ఔట్ పుట్ వుంటుందనీ, మొదటి భాగంలోని ఔట్ పుట్ తో మరో సినిమా కూడా తీయవచ్చని టాక్ వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రష్మిక ఇంకా షూట్ లో పాల్గొనలేదు. దర్శకుడు తీసిన షాట్ నే  ఒకటికి రెండు సార్లు తీస్తాడనే టాక్ వుంది. దాంతో అసలు ఆగస్టులో అనుకున్న టైంలో సినిమా బయటకు రాదనే టాక్ నెలకొంది. ఏది ఏమైనా నాని రాకతో కొత్త క్రేజ్ ఏర్పడింది.
 
నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాకు వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో నాని పాత్ర సరికొత్త పంథాలో పాత్ర వుందని తెలుస్తోంది.