ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (14:22 IST)

'బాహుబలి బాయ్స్‌' కోసం కరణ్ జోహార్ పార్టీ.. తరలివచ్చిన యువ తారామణులు

హిందీలో 'బాహుబలి 2' చిత్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ బాహుబలి బాయ్స్ కోసం (ప్రభాస్, రానా) ఓ విందు పార్టీని ఏర్పాటుచేశాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ పార్టీకి టాలీవుడ్ హీరో ప్రభాస్‌తో పాటు మరో హీరో రానా కూడా

హిందీలో 'బాహుబలి 2' చిత్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ బాహుబలి బాయ్స్ కోసం (ప్రభాస్, రానా) ఓ విందు పార్టీని ఏర్పాటుచేశాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ పార్టీకి టాలీవుడ్ హీరో ప్రభాస్‌తో పాటు మరో హీరో రానా కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ పార్టీకి బాలీవుడ్ యువ తారాగణం భారీ సంఖ్యలో తరలివచ్చింది. కరణ్ జోహార్ నివాసంలో ఈ పార్టీ జరుగగా, ఈ పార్టీ మొత్తం ప్రభాస్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. 
 
ఈ పార్టీకి హాజరైన బాలీవుడ్ స్టార్లలో అలియా భట్, వరుణ్ ధావన్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ తదితరులు ఉన్నట్టు సమాచారం. 'బాహుబలి' సినిమాను హిందీలో కరణ్ జొహార్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, కరణ్ పార్టీ ఇచ్చాడు. కొద్ది రోజులుగా యూఎస్ పర్యటనలో ఉన్న ఉన్న ప్రభాస్... తిరిగి వచ్చిన నేపథ్యంలో కరణ్ ఈ విందు పార్టీని ఏర్పాటు చేశాడు.