శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (13:12 IST)

గుర్రం నడపడంలో బాలయ్య మొనగాడు.. చిరంజీవి గిరంజీవి పనికిరాడు : బాబూ మోహన్

తెలుగు సినీ హాస్య నటుడు, మాజీమంత్రి బాబూ మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
బాలకృష్ణను మెచ్చుకుంటూ చిరంజీవి, గిరంజీవి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
''భైరవద్వీపం'' చిత్రంలో బాలకృష్ణ, నేను గుర్రాలపై వెళ్తుంటాం. గుర్రం నడపడంలో బాలకృష్ణ మొనగాడు. గుర్రాలపైకి ఎగిరి దూకుతుంటాడు. బాలకృష్ణ మాదిరి గుర్రాన్ని నడపడం చిరంజీవి, గిరంజీవి ఎవరికీ చేతకాదు. ఏం పట్టుకోకుండా జూలు పట్టుకుని గుర్రంపై పోతుంటాడు" అంటూ బాబూమోహన్ వ్యాఖ్యానించాడు. 
 
ఆ తర్వాత దీనికి కొనసాగింపుగా ''తీటగాడు.. నేను తోకవైపు కూర్చుని నడుపుతుంటే.. నన్నొక తన్ను తన్నాడు" అని బాబూ మోహన్ అన్నాడు కానీ.. అది బాలయ్యనుద్దేశించా.. మరొకరి గురించా అన్నది స్పష్టత లేకపోయింది. 
 
చిరుతో పోలుస్తూ బాలయ్య గురించి బాబూ మోహన్ ఇలా పొగిడేసరికి నందమూరి అభిమానులకు ఈ వీడియో కనువిందుగా ఉంటే, మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఆగ్రహం తెప్పిస్తోంది.