మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (17:29 IST)

బాలకృష్ణ, దర్శకుడు బాబీ సినిమా టైటిల్ ప్రకటన - దీపావళికి టీజర్

Balakrishna
Balakrishna
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్ షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం తాజా అప్ డేట్ దసరానాడు అక్టోబర్ 12 శనివారంనాడు ప్రకటించనున్నారు. సినిమా టైటిల్, విడుదల తేదీని రేపు ప్రకటిస్తామని, దీపావళికి టీజర్ విడుదల చేస్తామని చిత్ర నిర్మాత నాగవంశీ తెలియజేశారు. ఇప్పటికే బాలక్రిష్ణ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ఫుల్ స్టాప్ పెట్టేలా సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మాత నాగవంశీ శుక్రవారంనాడు క్లారిటీ ఇచ్చారు.
 
 బాలకృష్ణ సూపర్ హీరోగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపుప్రకటించబోయే రిలీజ్ డేట్ రోజునాడే ఆయన గెటప్ కూడా విడుదలచేయనున్నారు. తాజా సమాచారం మేరకు విజయవాడలోని ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుపుకుంటుంది. కీలక సన్నివేశాలు విజయవాడ పరిసరప్రాంతాల్లో తీస్తున్నారు. ఇంతకుముందు అఖండలో దేవాలయాల ప్రాముఖ్యత, విలువల గురించి బోయపాటి తెలియజేశారు. ఇప్పుడు ఈ సినిమాలో అంతకుమించి అంశాలు వుంటాయని తెలుస్తోంది. తాజాగా తిరుమల విషయాన్ని సూచాయిగా ప్రస్తావించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.