మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (19:36 IST)

డిస్కోకింగ్ మిథున్ చక్రవర్తి : బాలకృష్ణ

balakrishna
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి 'డిస్కోకింగ్' అని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఒక గొప్ప నటుడుకి కేంద్రం ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇవ్వడం ఎంతో హర్షించదగిన విషయమన్నారు. ఇదే విషయంపై బాలకృష్ణ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
తొలి చిత్రం 'మృగయా'తోనే నటునిగా తనదైన బాణీ పలికించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా మిథున్ చక్రవర్తి నిలిచారనీ, ఆరంభంలో వాస్తవ చిత్రాలతో సాగినా, తర్వాత బాలీవుడ్ కమర్షియల్ మూవీస్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారని తెలిపారు. ముఖ్యంగా 'డిస్కోడాన్స్'కు మిథున్ చక్రవర్తి విశేషమైన పేరు సంపాదించి పెట్టారని గుర్తు చేశారు. 
 
మిథున్ చక్రవర్తితో తనకు చిత్రబంధం ఉందనీ, అదెలాగంటే తాను సోలో హీరోగా బయటి సంస్థల చిత్రాలలో నటించడానికి తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం 'డిస్కోకింగ్' అని, ఈ చిత్రానికి మిథున్ చక్రవర్తి హిందీ సినిమా 'డిస్కో‌డాన్సర్' ఆధారమని తెలిపారు. అలా మా ఇద్దరికీ చిత్రబంధం ఉందని పేర్కొన్నారు. 
 
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమమైన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డుకు ఎంపికై మిథున్ చక్రవర్తికి తన హృదయపూర్వక శుభాభినందనలు. మిథున్ నటునిగా మరెన్నో విలక్షణమైన పాత్రలలో మురిపిస్తూ సాగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.