ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (14:20 IST)

కంటతడి పెట్టుకున్న బాలకృష్ణ..

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు నందమూరి బాలకృష్ణ. బెంగుళూరులో ఉన్న కంఠీరవ స్టేడియంలో ఉన్న పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు వచ్చారు నందమూరి బాలకృష్ణ. అయితే పునీత్ పార్థివ దేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు బాలకృష్ణ. పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్‌ను ఓదార్చారు.
 
నిజానికి పునీత్ రాజ్ కుమార్ నందమూరి బాలకృష్ణతో, ఆయన కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. పునీత్ మరణం తీరని లోటుగా చెప్పుకొచ్చారు బాలకృష్ణ పేర్కొన్నారు. ఇక మరికాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బెంగుళూరుకు రానున్నారు.