శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 నవంబరు 2023 (16:46 IST)

అడివి శేష్‌ G2లో హీరోయిన్ గా బనితా సంధు

Banita Sandhu
Banita Sandhu
అడివి శేష్ అప్ కమింగ్ మూవీ G2 కోసం అభిమానులను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ ఈ సినిమా పై అంచనాలు పెంచింది. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ని అనౌన్స్ చేశారు. గూడాచారి ‘G2’ లో అడివి శేష్‌ కు జోడిగా బనితా సంధు నటిస్తోందని మేకర్స్ తెలియజేశారు.  
 
G2.. మేజర్, కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 మేకర్స్ నుంచి వస్తున్న యాక్షన్ స్పై థ్రిల్లర్. ఇలాంటి ప్రతిభావంతులైన నటీనటులు స్టార్ కాస్ట్ లో చేరడంతో చిత్రం బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ అవుతుందని హామీ ఇచ్చింది. అక్టోబర్, సర్దార్‌ ఉదమ్‌ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది బనిత. అంతేకాదు, ఆమె ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, పంజాబీ పరిశ్రమలలో పని చేస్తున్నారు. G2 లో సరికొత్త పాత్రలో ఆమెను చూడటానికి అభిమానులు ఉత్సాహంగా వున్నారు.
 
దీని గురించి బనితా మాట్లాడుతూ.. ఇది నా మొదటి పాన్-ఇండియా చిత్రం. ఇటువంటి అద్భుతమైన, విజనరీ టీమ్‌తో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. ఇది నేను ఇంతకు ముందు చేయని భిన్నమైన పాత్ర. ప్రేక్షకులు నన్ను పూర్తిగా కొత్త అవతార్‌లో చూడబోతున్నారు. దీని కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో పని చేయడం క్రియేటివ్ గా చాలా ఆనందాన్ని ఇస్తోంది’’ అన్నారు
 
అడివి శేష్ మాట్లాడుతూ.. G2 వరల్డ్ కి బనితాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. అద్భుతమైన కొలాబరేషన్ కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.
 
వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.