శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (17:46 IST)

సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి ల భరతనాట్యం గ్రాండ్ గా విడుదల

Surya Teja Ele - Meenakshi Goswami
Surya Teja Ele - Meenakshi Goswami
సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ 'భరతనాట్యం'. దొరసాని ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో  పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ వంటి అనేక మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
లీడ్ పెయిర్ పై చిత్రీకరించిన రొమాంటిక్ నంబర్ చేసావు ఎదో మాయను విడుదల చేసిన మేకర్స్ సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 5న వేసవిలో 'భరతనాట్యం' ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉంది. సమ్మర్ హాలిడేస్ ను సినిమా క్యాష్ చేసుకోబోతోంది.
 
తన కథలో హీరోలా జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొనే ఔత్సాహిక ఫిల్మ్ మేకర్ గా ఇందులో సూర్య తేజ కనిపించబోతున్నారు. ప్రోమోల్లో సూర్యతేజ తన నటనతో ఆకట్టుకున్నాడు.
 
ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, వెంకట్ ఆర్ శాకమూరి డీవోపీగా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఈ చిత్రానికి ఎడిటర్.