ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (19:53 IST)

ఆ కుర్చీని మడతపెట్టడమే కాదు.. క్లాసికల్ కూడా కుమ్మేస్తా..!

Sreeleela
Sreeleela
కుర్చీ మడతపెట్టి అందం శ్రీలీల డ్యాన్స్ కుమ్మేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అగ్ర హీరోలకే ఆమె టఫ్ ఇస్తుందని సూపర్ స్టార్ మహేష్ బాబు కొనియాడిన సందర్భాలున్నాయి. అయితే ఆమె క్లాసికల్ డ్యాన్సర్ అనే విషయం చాలామందికి తెలియదు. ఆమె ఇటీవల సమతా కుంభ్ 2024లో అద్భుతమైన శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Sreeleela
Sreeleela

 
సంప్రదాయ పట్టు చీర ధరించి, శ్రీలీల ఆండాళ్‌కు సంబంధించిన నృత్య ప్రదర్శనతో చూపరులను కట్టిపడేసింది. ఆమె నృత్యంలో హావభావాలు, భరతం ఆకట్టుకుంది. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
Sreeleela
Sreeleela
 
ఇక శ్రీలీల సినిమాల సంగతికి వస్తే.. శ్రీలీల పవన్ కళ్యాణ్‌తో కలిసి భారీ అంచనాలు ఉన్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రంలో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్‌మెంట్ల కారణంగా సినిమా నిర్మాణం ఆలస్యమైంది. 

Mahesh Babu, sreeleela
Mahesh Babu, sreeleela