సల్మాన్ ఖాన్‌కు కోపమొచ్చింది.. సెట్స్ నుంచి వెళ్ళిపోయాడు..
కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కోపమొచ్చింది. దబాంగ్ ఖాన్ సల్మాన్ ఖాన్ సాధారణంగా అందరినీ నవ్విస్తుంటాడు. అలాంటి సల్లూభాయ్‌కే కోపం తెప్పించి సెట్స్ నుంచి వెళ్లిపోయేలా చేశాడు ఓం స్వామి. ఇంతకీ ఏం జరిగింద
కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కోపమొచ్చింది. దబాంగ్ ఖాన్ సల్మాన్ ఖాన్ సాధారణంగా అందరినీ నవ్విస్తుంటాడు. అలాంటి సల్లూభాయ్‌కే కోపం తెప్పించి సెట్స్ నుంచి వెళ్లిపోయేలా చేశాడు ఓం స్వామి. ఇంతకీ ఏం జరిగిందంటే? భాయ్ హోస్ట్ చేస్తున్న సెలబ్రెటీ రియాల్టీ షో బిగ్‌బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్‌గా ఓం స్వామి పాల్గొన్నాడు. కంటెస్టెంట్లు ఒకర్నొకరు తిట్టుకుంటూ.. నాటకీయంగా వ్యవహరించడమే బిగ్‌బాస్ షో ప్రత్యేకత.
కానీ ఈ తిట్ల దండకం మితిమీరింది. ఓం స్వామి బిగ్ బాస్ షోలో రోహన్ మెహ్రా అనే కంటెస్టెంట్ గురించి అతడి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడాడు. అప్పటికీ సల్మాన్ ఇలా ప్రవర్తిస్తే బాగుండదని పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఓం స్వామి వినిపించుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడంతో సల్మాన్‌కి కోపమొచ్చింది.
జస్ట్ యాక్టింగ్ చేస్తున్నానంతే అని ఓంస్వామి చెప్పడంతో భాయ్ కోపం కట్టలు తెంచుకుంది. ఇలా ప్రవర్తించడం వినోదాత్మకంగా ఉండదంటూ భాయ్ బిగ్‌బాస్ సెట్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. నిర్మాణ బృందం సల్మాన్ ఖాన్‌ను ఎంత కూల్ చేసేందుకు ప్రయత్నించినా వారి తరం కాలేదు. ఇలాంటి వ్యవహారాలు తనకు ఏమాత్రం పడవని చెప్పుకొచ్చాడు.