మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (11:27 IST)

శ్రీముఖిపై అసత్యపు ప్రచారం.. పోలీస్ స్టేషన్‌లో కేసు..

బిగ్ బాస్ మూడో సీజన్‌లో భాగంగా శ్రీముఖి పేరిట సోషల్ మీడియాలో వున్న ఫేక్ అకౌంట్స్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. శ్రీముఖిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె సోదరుడు శుష్రుత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఒక ప్రముఖ దినపత్రికపై ఫిర్యాదు చేశారు. 
 
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్‌ ద్వారా జరుగుతున్న ప్రచారాన్ని పరిగణలోకి తీసుకుని ఆ పత్రిక శ్రీముఖిపై అసత్య ప్రచారానికి పూనుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మొదట మౌనం వహించినా.. రోజురోజుకు ఆ పత్రిక శ్రీముఖిపై మరింత వ్యతిరేక కథనాలను వ్యాప్తి చేస్తుండటంతో పోలీసులను ఆశ్రయించక తప్పలేదని చెప్పారు. శ్రీముఖి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ పత్రికపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 
శ్రీముఖి ఇమేజ్ డ్యామేజ్ చేసి.. ఆమె ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికే ఇలాంటి కుట్రలకు తెరలేపారని శుష్రుత్ ఆరోపించారు. కాగా, బిగ్‌బాస్ గత ఎపిసోడ్‌లో రాహుల్ సిప్లిగంజ్‌ను 'బ్లాక్ షీప్' అంటూ శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 
 
రాహుల్‌ పట్ల శ్రీముఖి వర్ణ వివక్ష చూపిస్తోందంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ విమర్శించారు. ఇదే విషయంపై సదరు పత్రిక కథనాన్ని ప్రచురించగా.. శ్రీముఖిపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆమె సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు.