గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (12:27 IST)

ఆషురెడ్డి ఎలిమినేట్ అయ్యింది.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో జబర్దస్త్ ఆది హౌస్‌లోకి వస్తాడా?

బిగ్ బాస్ హౌస్ నుంచి ఆషురెడ్డి ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం సరదాగా సాగిన ఎపిసోడ్ ఎండింగ్‌కి అషురెడ్డి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. అషురెడ్డిని హౌస్ మేట్స్ అంతా కలిసి సరదాగా పాటలు పాడుతూ సెండ్ ఆఫ్ పలికారు.

హౌస్‌లో సున్నితంగా వ్యవహరించి, కలుపుగోలుగా ఉన్న అషు ఎలిమినేట్ అవుతుందని ముందుగానే అందరూ భావించారు. గత వారం రోజుల నుంచి ఆషురెడ్డి తన హాట్ డ్యాన్సులతోనూ కాస్త దుమ్ము రేపినా అప్పటికే సమయం మించిపోయింది. ఆమెకు ఎలిమినేషన్ తప్పలేదు. 
 
ఇకపోతే.. ఆషు రెడ్డి స్థానంలో జబర్దస్త్ హైపర్ ఆది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తాడని టాక్. ఈ వారం ఎపిసోడ్‌లో హైపర్ ఆది స్కిట్ లేకపోవడంతో జబర్దస్త్ షో చూసే ప్రేక్షకులు ఒకింత నిరాత్సాహానికి గురైనట్టు సమాచారం. ఐతే.. జబర్ధస్త్ షోకు హైపర్ ఆది రాకపోవడానికి కారణం.. తాజాగా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ 3 హౌస్‌లోకి వైల్డ్ కార్ట్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం కోసమేనని తేలింది.
 
ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్ నుంచి అషు రెడ్డి ఎలిమినేషన్ ఖాయమైన నేపథ్యంలో బిగ్‌బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా హైపర్ ఆదిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈషా రెబ్బా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. 
 
ఒకవేళ ఈ వారం ఐతే ఈషా రెబ్బా లేకపోతే హైపర్ ఆది ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ వారం కాకపోయినా వచ్చే వారం వీరిద్దరిలో ఎవరైనా ఒకరు బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్తారని టాక్ వస్తోంది.