గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (11:47 IST)

రోహిణి ఎలిమినేషన్.. చెంపపై కొట్టుకుంటూ కన్నీరు పెట్టుకున్న శివజ్యోతి

బిగ్ బాస్ మూడో సీజన్‌ రియాల్టీ షోలో భాగంగా ఆదివారం రోహిణి ఎలిమినేట్ అయ్యింది. రోహిణి ఎలిమినేట్ ప్రకటన రాగానే శివజ్యోతి తట్టుకోలేకపోయింది. వెక్కివెక్కి ఏడ్చేసింది. రోహిణి ఎలిమినేషన్‌కు తానే కారణమన్న బాధతో బోరున విలపించింది. ఆదివారం షో మొత్తం సరదాగా సాగిన నేపథ్యంలో చివరి పది నిమిషాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 
 
ఎలిమినేషన్‌లో ఉన్న శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణిలలో తొలి  ఆరుగురు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోగా రోహిణి షో నుంచి ఎలిమినేట్ అయింది. రోహిణి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించగానే శివజ్యోతి వెక్కివెక్కి ఏడ్చేసింది. రోహిణి ఎలిమినేషన్‌కు తానే కారణమన్న బాధతో బోరున విలపించింది. నామినేషన్ సమయంలో కన్‌ఫెషన్ రూం నుంచి బయటకు వచ్చాక ఇతర సభ్యులతో సైగల ద్వారా ఎవరు నామినేట్ అయింది చెప్పడాన్ని చూసిన బిగ్‌బాస్.. శివజ్యోతి, రోహిణిలు ఇద్దరినీ ఎలిమినేషన్‌కు నామినేట్ చేశాడు.
 
అయితే, ప్రేక్షకుల ఓట్లతో శివజ్యోతి బయటపడగా, రోహిణి షో నుంచి ఎలిమినేట్ అయింది. తనవల్లే రోహిణి ఎలిమినేట్ అయిందంటూ పశ్చాత్తాపంతో శివజ్యోతి ఏడ్చేసింది. తన చెంపపై కొట్టుకుంటూ కన్నీరు పెట్టుకుంది. రోహిణి కూడా భావోద్వేగానికి గురైంది.