బిగ్ బాస్ -3 : ఎలిమినేషన్ జాబితాలో ఉన్నదెవరు?
రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ ప్రసారాలు దిగ్విజయంగా మూడు వారాలు పూర్తి చేసుకుని, నాలుగో వారంలోకి అడుగుపెట్టాయి. అయితే, ఈ వారాంతం ఎలిమినేషన్ ప్రక్రియకు సోమవారం నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే, ఈ ఎలిమినేషన్ పక్రియ గతంలో కంటే కాస్త భిన్నంగా ఉండనుంది.
ఇద్దరు చొప్పున ఇంటి సభ్యులను పిలిచి నామినేషన్ పక్రియ జరిపారు. ఇద్దరిలో ఎవరు సేవ్ అవుతారో, ఎవరు ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతారో వాళ్లే చర్చించుకొని బిగ్‌బాస్‌కు చెప్పాలి. పునర్నవి, అలీ రెజాలకు ఇమ్యూనిటీ లభించిన కారణంగా వారిద్దరు నామినేషన్‌కు వెళ్లలేదు. ఇక శ్రీముఖి గత వారం టాస్క్‌లో తప్పు చేసిన కారణంగా ఆమె డైరెక్టుగా ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు.
మిగిలిన సభ్యుల్లో తొలుత వితిక, రవిలు వెళ్లి ఎలిమినేషన్‌పై చర్చించుకున్నారు. టాస్క్ సమయంలో తాను తప్పు చేశాను కనుక ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతాను అంటూ రవి చెప్పుకొచ్చాడు. ఇక శివ జ్యోతి రోహిణిలలో శివజ్యోతి నామినేట్ అయి రోహిణిని సేవ్ చేసింది. వరుణ్, మహేష్‌లలో మహేష్ సేవ్ అవ్వగా వరుణ్ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యాడు. అషూరెడ్డి, బాబా భాస్కర్‌లలో అషూ సేవ్ అవ్వగా బాబా భాస్కర్ ఎలిమినేషన్‌లో ఉన్నాడు. రాహుల్, హిమజలలో రాహుల్ ఎలిమినేషన్‌లో నిలిచాడు.