మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (11:02 IST)

దీప్తి సునయన-శ్రీహాన్‌లకు ఏమైంది..?

బిగ్ బాస్ నుంచి  బయటికి వచ్చిన షణ్ముఖ్‌కు చిక్కులు తప్పేలా లేవు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వీళ్లందరినీ వారి సన్నిహితులు ఎంతో ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. కానీ సిరిని రిసీవ్ చేసుకోవడానికి శ్రీహాన్ రాలేదు. అలాగే షణ్ముఖ్ జస్వంత్ ను కలవడానికి దీప్తి సునయన రాలేదు. ఇలా వీరిద్దరూ వారిని ప్రేమిస్తున్నప్పటికీ వారిని రిసీవ్ చేసుకోవడానికి రాకపోవడానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
 
ఇందుకు గల కారణం పక్క బిగ్ బాస్ నిర్వాహకులు అని చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ సిరితో చేసిన రోమాన్స్ ఇందుకు గల కారణం. వీరిద్దరూ హౌస్లో ఇలా ఒకే బెడ్ ,ఓకే దుప్పటి, ముద్దులు, కౌగిలింతలు అంటూ రెచ్చిపోయారు. అయితే బిగ్ బాస్ రేటింగ్స్ కోసం వీరిని ఎంకరేజ్ చేస్తున్నన్నప్పటికీ వీరి రోమాన్స్ కి ఏనాడు అడ్డుకట్ట వేయలేదు. 
 
ఈ క్రమంలోనే జీవితంలో పెళ్లిళ్లు చేసుకుని ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు జంటలు విడిపోయినట్లు తెలుస్తోంది. అందుకు గల కారణం సోషల్ మీడియా వేదికగా దీప్తి సునయన చేసిన పోస్ట్ బట్టి మనకు తెలుస్తుంది.
 
అలాగే ఇంతకు ముందు షణ్ముఖ్ జస్వంత్ కి మద్దతు తెలుపుతూ దీప్తి సునయన చేసిన పోస్టులు ఒక్కటి కూడా ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో కనిపించవు. అలాగే ఆమె ఇంస్టాగ్రామ్ లో షన్ను బ్లాక్ లిస్ట్ లో ఉండిపోయారు. ఇక శ్రీహన్ విషయానికి వస్తే శ్రీహాన్ ఈయన తన ఇంస్టాగ్రామ్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.