సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (18:09 IST)

షన్ను కొంపముంచిన అంశాలు.. ప్రతి దానికీ కౌగిలించుకుంటే ఎలా?

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో షన్ను రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్‌గా నిలిచిన సన్నీతో పోల్చుకుంటే బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందు షన్నుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. కానీ ఒంటరిగా ఆడి వుంటే గెలిచివుండేవాడని టాక్ వస్తోంది. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా హౌస్లోకి అడుగుపెట్టిన షన్ను రోజులు గడుస్తున్న కొద్దీ తనలోని లక్షణాలను ఒక్కొక్కటిగా బయటపెట్టుకుంటూ వచ్చాడు. అతడి ప్రవర్తన హౌస్ మేట్స్ నే కాదు చూసే జనాలకు కూడా చిర్రెత్తుకొచ్చేలా తయారైంది. 
 
అంతెందుకు అయిదేళ్ల పాటూ రిలేషన్ షిప్‌లో ఉన్న ప్రియురాలు దీప్తి సునయన కూడా షన్నును సపోర్ట్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. అంతెందుకు బిగ్ బాస్ హోస్‌లోకి షణ్ముక్ తల్లి వచ్చి అతడికి, సిరికి 'గేమ్‌ను గేమ్‌లా ఆ డండి, మరీ ఎమోషనల్ అయిపోవద్దు' అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చింది. 
 
తరువాత సిరి తల్లి వచ్చి 'ప్రతి దానికి కౌగిలించుకోవడం నచ్చడం లేదు' అని చెప్పింది. అలా చెప్పాక ఇద్దరూ హగ్ లిచ్చుకోవడం మరీ ఎక్కువ చేశారు. ఇది షన్నుపై నెగిటివ్‌ను సంపాదించి పెట్టింది.
 
ప్రతిసారి ఇద్దరూ హగ్ పేరుతో అతుక్కోవడం... 'ఫ్రెండ్లీ హగ్' అని చెప్పుకోవడం పరిపాటైంది. షన్ను చెప్పిన ప్రకారం ఫ్రెండ్సంతా అలా చీటికిమాటికి హగ్ పేరుతో అతుక్కోవాలా? అనే చర్చలు కూడా మొదలయ్యాయి. అందుకే 'హగ్గుల స్టార్' అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ సిరితో షన్ను చేసిన అతి... అతని కొంపే ముంచింది. టైటిల్ నుంచి దూరం చేసిందని టాక్ వచ్చింది.