మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (18:27 IST)

షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో విషాదం.. ఏమైంది?

shanmukh jaswanth
బిగ్ బాస్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో విషాదం నెలకొంది. షన్ను బామ్మ మరణించారు. ఈ మేరకు షన్ను తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టేశాడు. షన్ను చేసిన పోస్ట్ చూసి, అందులో తన బామ్మతో ఉన్న రిలేషన్ చూసి అందరూ ఎమోషనల్ అవుతున్నారు. 
 
షన్నుని కాదని దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ షన్ను మాత్రం ఇంకా దీప్తి సునయని కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే మొన్న బిగ్ బాస్ స్టేజ్ మీదకు షన్ను వచ్చిన సమయంలోనూ దీప్తి సునయన టాపిక్ వచ్చినా తప్పించుకోకుండా సమాధానం చెప్పాడు. 
 
దీప్తి సునయనని త్వరలోనే కలుస్తాను అని అందరి ముందే ధైర్యంగా చెప్పేశాడు. అయితే షన్ను మాత్రం తాజాగా బాధపడుతున్నట్టు కనిపిస్తోంది. తన బామ్మ మరణించడంతో ఆయన విషాదంలో మునిగిపోయాడు.