గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 29 జులై 2019 (11:08 IST)

బిగ్ బాస్ తెలుగు: హౌజ్‌ నుంచి హేమ అవుట్.. ట్రాన్స్‌జెండర్ తమన్నా ఇన్

ఆదివారం పూట బిగ్ బాస్ హౌజ్‌లో సందడి నెలకొంది. అయితే హేమ ఎలిమినేట్ అయ్యింది. హేమ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. సెల్ఫీ మూవ్‌మెంట్‌ అనంతరం బయటకు వచ్చిన హేమ.. తన జర్నీకి సంబంధించిన ప్రోమోను చూస్తూ ఎమోషనల్‌ అయింది. వంటగది వల్లే గొడవలు వచ్చాయని చెప్పుకొచ్చింది. వంటగదికి మినహాయించి తనపై ఎలాంటి ఫిర్యాదులు లేవని వెల్లడించింది. 
 
ఓ మదర్‌ ఫీలింగ్‌తో ఉన్నానని, అయితే ఎక్కువ పెట్టుకోవద్దు.. అది తీయోద్దు ఇది తీయోద్దు అని అనడంతో అది డామినేట్‌ చేయడం, కమాండింగ్‌లా అందరికీ అనిపించిందని హేమ తెలిపింది. అందుకే అందరూ తనను బ్యాడ్‌ అని అనుకున్నారని చెప్పింది. వాళ్ల కోసం చేసేది వాళ్లకే అర్థం కానప్పుడు హౌస్‌లో వుండటం వ్యర్థమనిపించిందని హేమ తెలిపింది. ఇంట్లోని సభ్యులందరూ మంచి వారేనని, శ్రీముఖి.. బాబా భాస్కర్‌ మాత్రం ఫైనల్‌ వరకు ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
ఇకపోతే, హేమ బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేషన్ ద్వారా బయటికి రావడంతో.. వైల్డ్‌ కార్డ్‌ ద్వారా తమన్నా ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రాగానే అందరిని డామినేట్‌ చేసిన హేమపై వ్యతిరేకత ఏర్పడింది. దీంతో మొదటి వారంలో హేమ ఇంటిబాటపట్టింది. అయితే హేమను రీప్లేస్‌ చేసేందుకు బిగ్‌బాస్‌.. ఓ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీని ప్రవేశపెట్టారు. ఆదివారం ఉదయం నుంచి ప్రచారం జరిగినట్టుగా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలో ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది.