సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (19:05 IST)

అరియానా అనేది నా అసలు పేరు కాదు.. తెరవెనక తొక్కిపారేశారు..

Ariyana
బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌లు భావోద్వేగానికి గురైయ్యారు. వారి వారి జీవితంలో మర్చిపోలేని సంఘటనలు మాట్లాడుతూ అందరికీ కంటినీరు తెప్పించారు. కుటుంబంలో జరిగిన సంఘటనలు చెప్పుకుంటూ వాళ్లు బాధపడుతూ ఇతరులను ఏడిపించేస్తున్నారు. ఈ క్రమంలో అరియనా తాను చిన్ననాటి నుంచి మగదిక్కు లేని బతుకులు అని చెప్పి అందరినీ ఏడిపించేసింది.
 
ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రి నా నుంచి దూరం అయ్యాడు అని… తల్లి గవర్నమెంట్ హాస్పటల్‌లో నర్స్ కాబట్టి పోషించిందని తెలిపింది. తన తల్లి చాలా పద్ధతిగా పెంచడం జరిగిందని, దీంతో ఫస్ట్ యాంకరింగ్ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉందంటే తల్లి ఒప్పుకోలేదని అరియానా తెలిపింది.
 
చదువుతున్న డిగ్రీలో సబ్జెక్ట్స్ ఉండిపోవడంతో… యాంకరింగ్ విషయంలో ఇంటిలో బతిమాలాడి ఎలాగైతే నెగ్గి… ఈ ఫీల్డ్‌లోకి వచ్చినట్లు చెప్పుకొచ్చింది. తెరవెనక రాజకీయాలు తనను తొక్కి పారేశాయని వెల్లడించింది. తిండి తినని రోజులున్నాయి. చివరకు ఎనిమిది వందల రూపాయలు అదేవిధంగా ఇంకా తక్కువ డబ్బులకే బయట ఈవెంట్లకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది. 
 
కానీ జీవితంలో బిగ్ బాస్ హౌస్‌లో రావడం అనేది తనకి చాలా గొప్ప విషయమని అరియానా తెలిపింది. అరియానా అనేది తన అసలు పేరు కాదని… ఓపెనింగ్ సెర్మన్ రోజు నాగార్జున అడిగినా గాని చెప్పలేదు అంటూ అసలు గుట్టు బయట పెట్టింది. తన అసలైన పేరు అర్చన అని చెప్పుకొచ్చింది.