బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (12:53 IST)

Bigg Boss Telugu 8: పదోవారం డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వ, హరితేజ అవుట్

Hari Teja
Hari Teja
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో భాగంగా అక్టోబ‌ర్ 6న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హ‌రితేజ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పదో వారం ఇక ఆడియ‌న్స్ ఓట్ల ప్ర‌కారం టైటిల్ ఫేవ‌రెట్‌లో ఒక‌రైన హ‌రితేజ ఎలిమినేట్ అయింది. ఆసక్తికరంగా సాగుతున్న ఈ షో పదోవారం డ‌బుల్ ఎమినేష‌న్ జ‌రిగింది. 
 
అనారోగ్య కార‌ణాల‌తో గంగ‌వ్వ త‌నంత‌ట తానే హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ ప‌దో వారం నామినేషన్స్‌లో ఉన్నారు. గౌత‌మ్‌కు అత్య‌ధిక ఓట్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న హరితేజ ఎలిమినేట్ అయినట్లు నాగ్ చెప్పాడు. 
 
ఎలిమేనేషన్ తర్వాత హరితేజ ఎమోషనల్ అయ్యింది. అయినా సంతోషంగానే వున్నానని చెప్పుకొచ్చింది. హౌస్‌లో ఉన్న వాళ్ల‌లో ఎవ‌రు మాస్కులు తీసి ఆడాలో చెప్పాల‌ని నాగార్జున అడిగారు. అవినాష్‌, రోహిణి, టేస్టీ తేజ‌, ప్రేర‌ణ‌, నిఖిల్ అని మాస్క్‌లు తీసి ఆడాల‌ని హ‌రితేజ చెప్పింది.