శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (18:05 IST)

బిగ్ బాస్ తెలుగు 3.. త్యాగానికి సిద్ధపడిన హౌజ్ మేట్స్.. బాబా భాస్కర్ క్లీన్ షేవ్

బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్ తొమ్మిదో వారం అందరూ త్యాగానికి సిద్ధపడి సేవ్ చేసేశారు. ఒక్క మహేష్‌ విషయంలోనే హిమజ చేసిన పనిలో పొరపాటు దొర్లగా నామినేషన్‌లోకి వచ్చేశాడు. అయితే ఈ వారంలో నామినేషన్‌ ప్రక్రియ ఉండబోదని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గార్డెన్‌ ఏరియాలో టెలిఫోన్‌ బూత్‌ను ఏర్పాటు చేసిన బిగ్‌బాస్‌.. అందులో ఓ ఫోన్‌ ఉంచాడు. 
 
అది రింగ్‌ అయిన వెంటనే అందరూ అక్కడికి పరిగెత్తారు. అయితే శ్రీముఖి ముందుగా లిఫ్ట్‌చేసిన కారణంగా నేరుగా నామినేట్‌ అయినట్లు ప్రకటించాడు. తాను సేవ్‌ కావాలంటే.. బాబా భాస్కర్‌ క్లీన్‌ షేవ్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. దీంతో బాబా భాస్కర్‌ క్లీన్‌ షేవ్‌ చేసుకుని శ్రీముఖిని సేవ్‌ చేశాడు. 
 
పునర్నవి కోసం ఇరవై గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ను రాహుల్‌ తాగేశాడు. వికారంగా అనిపిస్తున్న ఎంతో కష్టపడి ఆ టాస్క్‌ను కంప్లీట్‌ చేసి.. పునర్నవిని సేవ్‌ చేశాడు. దీంతో సంబరపడిన పున్ను.. రాహుల్‌ను గట్టిగా హత్తుకుని.. ఓ ముద్దు పెట్టేసింది. ఇక శివజ్యోతి కోసం మహేష్‌ తన జుట్టుకు ఎరుపురంగును వేసుకున్నాడు. హిమజ కోసం వరుణ్‌ పేడతొట్టేలో కూర్చున్నాడు.
 
తొమ్మిదో వారానికి గానూ ఎలిమినేషన్‌ ఉండబోదంటూ ప్రచారం జరగుతోంది. అయితే ఇప్పటివరకు మహేష్‌ ఒక్కడే నామినేషన్‌లో ఉన్నట్లు ప్రకటితమైంది. ఇక నేటి ఎపిసోడ్‌లో కొన్ని మార్పులతో మరో ఇద్దరో లేదా ఒక్కరో నామినేషన్‌లోకి వచ్చే అవకాశం ఉంది.