శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (19:18 IST)

అట్టర్ ప్లాఫ్ అవుతున్న బిగ్ బాస్ 3.. తుస్సుమన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ (వీడియో)

బిగ్ బాస్ మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు బుల్లితెర మీద ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్న బిగ్ బాస్ మూడో సీజన్ షో డిజాస్టర్ దిశగా వెళ్తుందని రేటింగ్‌ను బట్టి చెప్తున్నాయి. కార్తీకదీపం సీరియల్ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుంటే బిగ్‌బాస్ -3 చతికిలపడుతోంది. 
 
ఇంత ఖర్చు పెట్టి చేస్తోన్న ఈ షోకు ఆశించిన రేంజ్‌లో రేటింగులు రావడం లేదని తెలుస్తోంది. తెలుగులో బిగ్‌బాస్ -3కు పెట్టిన బడ్జెట్‌తో ఓ పది చిన్న సినిమాలు తీయొచ్చునని.. అలాంటి షో అట్టర్ ప్లాప్ దిశగా పోవడంపై నిర్వాహకులు తలపట్టుకుంటున్నారు. 
 
తొలి రెండు సీజన్లతో పోలిస్తే బెటర్ రేటింగులు రాకపోవడతో ఏం చేయాలా? అని యోచిస్తున్నారు. అందుకే ఈ క్రమంలోనే ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.   చివరకు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఊరించారు. ఓ హాట్ హీరోయిన్ అంటూ లీకులు ఇచ్చారు. శ్రద్ధాదాస్ వస్తుందనుకున్నారు. హెబ్బా పటేల్ పేరు గట్టిగా వినిపించింది. ఆఖరి నిమిషంలో ఈషా రెబ్బా అన్నారు.
 
చివరకు ఆ స్థానంలో పాత యాంకర్ శిల్పా చక్రవర్తిని పంపించారు. ఆమె యాంకరింగ్ ఎప్పుడో ? మానేసింది… జనాలు కూడా మర్చిపోయారు. హాట్ హీరోయిన్ హౌజ్ లోకి వస్తుందనుకుంటే.. ఇలా ఫేడ్ అవుట్ యాంకర్ ను పంపించి అందరి ఉత్సాహాన్ని నీరుగార్చారు.
 
ఆమెను ముందుగా చీకట్లో చూపించడంతో బాబా భాస్కర్ అయితే ఏకంగా రెజీనా వచ్చినట్లుందే అన్న సందేహం వ్యక్తం చేశారు. కంటెస్టెంట్లు కూడా హీరోయిన్ వస్తుందనుకుంటే చివరకు వాళ్లకు కూడా షాక్ తప్పలేదు. 
 
చివరకు అందరూ మర్చిపోయిన పాత యాంకర్ శిల్పా చక్రవర్తి రావడంతో కంటెస్టెంట్లు కూడా ఓస్ ఇంతేనా అనుకున్నారు. శిల్ప ఎంట్రీతో హౌస్‌లో ఉత్సాహం కాస్తా నిరుత్సాహంగా మారింది. ఇప్పటికే తొలి వైల్డ్ కార్డ్ తమన్నా సింహాద్రి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనే తుస్సుమంది.