శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 30 సెప్టెంబరు 2020 (22:17 IST)

బిగ్ బాస్, నన్నెందుకు ఎలిమినేట్ చేశారు? ఆ ఒక్కటే దేవి నాగవల్లి కొంపముంచిందా?

దేవి నాగవల్లి. న్యూస్ ఛానల్స్‌ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి . టివి ఛానల్లో ప్రముఖ యాంకర్. అందుకే ఆమెకు బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. కానీ అంత త్వరగా ఎలిమినేట్ అవుతుందని ఆమెకే అర్థం కావడం లేదట. ఆశ్చర్యపోతోంది. అసలేం జరుగుతుందో అర్థం కాక తలపట్టుకుంటోంది.
 
తాజాగా నాగార్జున బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ చేసిన వారిలో దేవి నాగవల్లి ఉన్నారు. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ దేవి నాగవల్లి. కానీ ఈమెను ఎలిమినేట్ చేయడం మాత్రం అందరూ షాక్‌కు గురవుతున్నారు. అస్సలు మెహబూబ్ ఎలిమినేట్ లిస్ట్‌లో మొదటి ప్లేస్‌లో ఉన్నారు. 
 
మెహబూబ్ వెళ్ళిపోతారని అందరూ భావించారు. కానీ అంతా రివర్స్. టివి 9 ఛానల్ పైన ఉన్న వ్యతిరేకత వల్లే ఆమెకు ఓట్లు పడలేదన్న ప్రచారం బాగానే సాగుతోంది. అందుకే ఆమెను ఎలిమినేట్ చేశారట. దీంతో దేవి నాగవల్లి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పడం ప్రారంభించారు.
 
హౌస్‌లో అందరూ ఒకే విధంగా ఉంటున్నాం. అందరూ ఫ్రెండ్సే. అయితే నన్ను ఎందుకు ఎలిమినేట్  చేశారో ఇప్పటికీ అర్థం కాలేదు. తల పట్టుకుని కూర్చున్నా. కానీ తప్పదు కదా. అభిమానులు ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుందిగా అంటూ దేవి నాగవల్లి లైట్ తీసుకునే ప్రయత్నం చేశారు.