ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (19:26 IST)

HBD త్రిష.. శ్రీవారిని దర్శించుకుంది.. బృందగా రోడ్డెక్కింది..!

Trisha
Trisha
తిరుమల శ్రీవారిని బుధవారం వీఐపీ విరామ సమయంలో సినీ హీరోయిన్ త్రిష దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆమెకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అలయాధికారులు స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
 
సూర్య వనగల దర్శకత్వంలో చెన్నై తెండ్రాల్ త్రిష తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సిరీస్ కి 'బృందా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.  
 
టాలీవుడ్ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా తన సోదరుడు ఆశిష్ కొల్లాతో కలిసి ఈ వెబ్ సిరీస్‌ని నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్‌లో ప్రసారం కానుంది. తాజాగా త్రిష పుట్టినరోజు సందర్భంగా, మూవీ మేకర్స్ ఒక మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఈ సిరీస్‌లో త్రిష ఎస్‌ఐ బృందా పాత్రను పోషిస్తోంది.
 
వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ 'బృందా టీమ్ కి చెందిన మా లీడింగ్ లేడీ త్రిష్ట్రాషర్స్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ మూవీ మేకర్స్ పోస్ట్ చేసారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సిరీస్‌లో సాయి కుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
 
అలాగే నేడు త్రిష 39 వ పుట్టినరోజును ది రోడ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పేరు 'ది రోడ్'. అరుణ్ వశీగరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 22 ఏళ్ళ క్రితం మధురైలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ పోస్టర్ లో త్రిష నడిరోడ్డుపై ఆగిన కారు బోనెట్‌పై చేతిని ఆనించి దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించింది. ఇదొక రివెంజ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.