శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (15:37 IST)

డైర‌క్ట‌ర్ ప‌ర‌శురామ్ ఆవిష్క‌రించిన క‌ర‌ణ్ అర్జున్ ఫ‌స్ట్ లుక్

Karen Arjun First Look launched by Parashuram
Karen Arjun First Look launched by Parashuram
భిన్న‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న‌ రోడ్ థ్రిల్ల‌ర్ `క‌ర‌ణ్ అర్జున్‌`.  రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై  అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించ‌గా ఈ చిత్రానికి మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ నిర్మాత‌లు.   ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్  సోమ‌వారంనాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఆవిష్క‌రించారు.
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ మాట్లాడుతూ,`క‌ర‌ణ్ అర్జున్  టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. ద‌ర్శ‌కుడు స్టోరి లైన్ కూడా చెప్పారు. ప్ర‌జంట్ ట్రెండ్‌కి క‌నెక్ట‌య్యే స్టోరి. టీమ్ అంద‌రూ కూడా ఎంతో ప్యాష‌న్‌తో సినిమా తీసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లు అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ శ్రీవ‌త్స మాట్లాడుతూ, మా సినిమా ఫ‌స్ట్ లుక్ ప‌ర‌శురామ్ లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. వారికి నా ధ‌న్య‌వాదాలు.  ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని లొకేష‌న్స్ లో పాకిస్థాన్ బార్డ‌ర్ లో ఎంతో రిస్క్ తీసుకుని షూటింగ్ చేశాం.  మూడు పాత్ర‌ల‌తో ఊహించని మ‌లుపుల‌తో ప్ర‌తి స‌న్నివేశం ఎంతో ఉత్కంఠ‌భ‌రితంగా సాగే రోడ్ థ్రిల్ల‌ర్ చిత్రమిది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే ఎమోష‌న్స్ ఉన్నాయి.  ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావ‌డానికి మా నిర్మాత‌లే కార‌ణం. వారు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నాకు పూర్తి స్వేచ్ఛ‌నివ్వ‌డంతో అనుకున్న‌ట్లు గా తీయ‌గ‌లిగాను. మా నిర్మాత‌లంద‌రికీ పేరు పేరునా నా ధ‌న్య‌వాదాలు.  సినిమా ఫ‌స్ట్ కాపీ రెడీ అయింది. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం`` అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ర‌వి మేక‌ల మాట్లాడుతూ,  డైర‌క్ట‌ర్ మోహ‌న్  డిఫ‌రెంట్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నేను ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌తో పాటు కొరియోగ్రఫీ కూడా చేశాను. ఇందులో రెండు పాట‌లున్నాయి. ఒక పాట కశ్మీర్ లో చేశాం. మ‌రో పాటు రాజ‌స్థాన్‌లో చేశాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా ఎంతో రిచ్ గా రావడానికి స‌హ‌క‌రించిన మా నిర్మాత‌ల‌కు థ్యాంక్స్ తెలిపారు.
 
అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా , మాస్ట‌ర్ సునీత్ , అనిత  చౌదరి, రఘు . జి,  జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి  ఫైట్స్ : రామ్ సుంకర; ఎడిటర్ : కిషోర్ బాబు; కాస్ట్యూమ్ డిజైనర్ : లతా మోహన్; మ్యూజిక్ : రోషన్ సాలూరి; పాట‌లుః సురేష్ గంగుల‌; కొరియోగ్రఫీ : రవి మేకల; డి .ఓ .పి : మురళి కృష్ణ వర్మన్;  పిఆర్వోః చందు ర‌మేష్ (బాక్సాఫీస్); ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రవి మేకల; ప్రొడ్యూసర్స్ :  డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్; కథ -మాటలు -స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం : మోహన్ శ్రీవత్స.