బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 జులై 2017 (17:52 IST)

స్రైడర్ ''బూమ్ బూమ్'' పూర్తి పాట కావాలా నాయనా..? (Video)

ప్రిన్స్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబోలో రూపొందుతున్న స్పైడర్ మూవీకి సంబంధించిన బూమ్ బూమ్ అనే పాట టీజర్ను ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్య

ప్రిన్స్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబోలో రూపొందుతున్న స్పైడర్ మూవీకి సంబంధించిన బూమ్ బూమ్ అనే పాట టీజర్ను ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో బూమ్ బూమ్ అంటూ సాగే స్పైడర్ తొలి పూర్తి పాటను ఆగస్టు రెండో తేదీన సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు టీజర్ ద్వారా వెల్లడించారు.
 
ఆగస్టు రెండో తేదీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శ్రీమంతుడు తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్.. స్పైడర్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. 
 
ఇక ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారు. ఎస్‌.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఒక్క పాట మినహా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.