గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (15:09 IST)

బజార్ రౌడీగా సంపూ.. ఐదు పాత్రలతో అలరించనున్న సంపూ..!

'హృదయకాలేయం'తో ఎంట్రీ ఇచ్చి కామెడీస్టార్‌గా పేరు తెచ్చుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ 'బజార్ రౌడీ'గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇంతకు ముందు 'కొబ్బరి మట్ట'లో త్రిపాత్రాభినయం చేసిన సంపూర్ణేశ్ ఇప్పుడు ఐదు పాత్రలతో ఆడియన్స్‌ను మైమరపించటానికి రెడీ అవుతున్నాడు. కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. 
 
మంచిర్యాల పరిసరాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ శుక్రవారం నుంచి హైదరాబాద్ పరిసరాల్లో జరగనుంది. ఐదు పాత్రల పోషణలో తగిన జాగ్రత్తలు తీసుకున్నానని, ఈ విషయంలో అన్నగారు నందమూరి తారకరామారావుగారిని స్ఫూర్తిగా తీసుకుని నటిస్తున్నానంటున్నారు సంపూర్ణేశ్. 
 
అతి త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నారు. 'కొబ్బరి మట్ట'లో త్రిపాత్రాభినయం చేసి భారీ డైలాగ్‌లతో ఆకట్టుకన్న సంపూ రాబోయే సినిమాలో ఎలాంటి ప్రయోగాలు చేస్తారో చూడాలి.