సమంత ప్లాన్ ఈసారి వర్కవుట్ అవుతుందా..?
సమంత అక్కినేని ప్రధాన పాత్రలో బి. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన విభిన్న కథాచిత్రం ఓ బేబీ. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. జులై 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా నుంచి... చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగ... నేను ఎలా మారిపోయి ఛంగుమని భలేగా.. అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేసారు.
ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం.. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి ఎలాగైనాసరే సక్సెస్ సాధించాలని సమంత ప్రమోషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుందట. ఏ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేయాలి..? ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్‌వ్యూస్ వెరైటీగా ఎలా చేస్తే బాగుంటుంది..? సక్సెస్ టూర్ ఎలా ఉండాలి..? రిలీజ్‌కి ముందు టూర్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది..?
ఇలా డిఫరెంట్ ఐడియాస్ గురించి తన పీఆర్ టీమ్‌తో చర్చిస్తుందట. చాలా ఎగ్రెసీవ్‌గా ప్రమోషన్స్ ఉండాలని చెబుతుందట. తన సినిమాలకు ఇలా తన ఐడియాస్‌తో డిఫరెంట్‌గా ప్రమోట్ చేసి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అలాగే చేయాలనుకుంటుందట. సురేష్ బాబు ఈ సినిమాపై కాస్తా అసంతృప్తితో ఉన్నాడనే టాక్ బయటకు రావడంతో సమంత మరింత అలర్ట్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. మరి.. ఈసారి సమంత ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి..!