ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (12:09 IST)

GOAT నటి పార్వతి నాయర్‌పై కేసు నమోదు.. ఏం చేసిందంటే..?

Parvati Nair
Parvati Nair
కోలీవుడ్ హీరోయిన్, గోట్ నటి పార్వతి నాయర్‌పై కేసు నమోదు అయ్యింది. పార్వతి నాయర్ ఇంట్లో పనిచేస్తున్న తనను దొంగతనం నెపంతో గదిలో బంధించి ఆమె స్నేహితులతో కలిసి టార్చర్ చేసిందని సదరు వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హీరోయిన్ పార్వతి నాయర్, అయాలా చిత్ర నిర్మాత కొడప్పాడి రాజేష్ సహా ఏడు మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
అసలు విషయానికి వస్తే.. నటి పార్వతి నాయర్ చెన్నైలోని నుంగంబాక్కంలో నివసిస్తున్నారు. 2022లో తన ఇంట్లో రూ.10 లక్షల విలువైన వాచ్‌లు, ఐఫోన్, ల్యాప్‌టాప్ తదితర వస్తువులు చోరీకి గురయ్యాయని నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
అయితే తనపై తప్పుడు కేసులు పెట్టి టార్చర్ చేస్తున్నారంటూ పార్వతి నాయర్ ఇంట్లో పనిచేసే వ్యక్తి సుభాష్ ఫిర్యాదులో చేశాడు. అయితే తాను ఎలాంటి దొంగతనం చేయలేదని.. తనను గదిలో బంధించి కొట్టారని.. పార్వతి నాయర్ తోపాటు మరో ఏడుగురిపై తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అయితే ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో చెన్నైలోని సైదాపేట కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుభాష్ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.