శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (10:45 IST)

అందాలతో అరిస్తున్న కేథ‌రిన్ థ్రెసా కొత్త సినిమాకు రెడీ

Catherine Theresa
Catherine Theresa
అందమైన టాలెంటెడ్ నటి కేథ‌రిన్ థ్రెసాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ.ఎం.జి. అనే నూతన నిర్మాణ సంస్థ ఓ లుక్ ను విడుదల చేసింది. చాలా గ్లామర్ గా యూత్ ను అలరించేవిధంగా వున్న కేథ‌రిన్ థ్రెసా గ్లామర్ తో కూడిన పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇండియా, అమెరికాలలో షూటింగ్ జరుపుకోెనున్నట్లు సమాచారం. గతంలో వి.ఎన్. ఆదిత్య చిత్రాలు సక్సెస్ కాలేకపోయాయి. హిట్ కోసం చాలా కాలంఎదురు చూస్తున్న ఈ సారి కేథ‌రిన్ థ్రెసా ఆశలు పెట్టుకున్నట్లుంది. 
 
వరల్డ్ ఫేమస్ లవర్, భళా తందనానా, బింబిసారా, మాచర్ల నియోజవర్గం వంటి సినిమాల్లో నటించిన ఆమె ఈ ఏడాది గ్లామర్ పాత్ర పోషించనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయిన ఈ చిత్ర కథను త్వరలో సెట్ పైకి తీసుకెళ్ళనున్నారు. మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.