గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (22:00 IST)

కలర్ ఫోటో హీరోయిన్‌కి తప్పని క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు

Kiran Abbavaram, Chandini Chowdhary
సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్‌కి బలైన హీరోయిన్లలో చాందిని చౌదరి కూడా ఒకరు. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలర్ ఫోటో అనే సినిమా ద్వారా పాపులర్ అయిన చాందిని చౌదరి అంతకుముందు పలు విధాలుగా పాపులర్ అవ్వాలని చూసినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. 
 
కానీ "కలర్ ఫోటో" సినిమా ద్వారా అమ్మడు నటనకు అందానికి ఎమోషన్స్‌కి జనాలు ఫిదా అయిపోయారు. ఈ సినిమా ద్వారానే ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది చాందిని చౌదరి.
 
అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవడంతో మళ్లీ ఎక్కడ మొదలుపెట్టిందో అక్కడికే వచ్చి ఆగింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందని.. ఓ ప్రముఖ బడా డైరెక్టర్ తనను కమిట్మెంట్ అడిగారని చెప్పుకొచ్చి ఎమోషనల్ అయ్యింది.
 
అంతేకాదు చాందినీ చౌదరిని ఆ డైరెక్టర్ తాకరాని చోట తాకుతూ కమిట్మెంట్ అడుగుతూ బిహేవ్ చేశారని ..దీంతో ఆమె నో చెప్పడంతో బిగ్ సినిమా నుంచి ఆమెను తీసేసారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.