ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 జూన్ 2024 (20:22 IST)

చంద్రబాబు గారిని కలిసి కుప్పం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశానని ని చెప్పా : హీరో సుధీర్ బాబు

Sudhir Babu
Sudhir Babu
హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర'. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.
 
డైరెక్టర్ జ్ఞానసాగర్ సెహరి లాంటి రొమాంటిక్ కామెడీ తీశారు. రెండో సినిమాగా హరోం హర లాంటి యాక్షన్ కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది ?
 
-నేను ముందు సెహరి చూడలేదు. తను నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఏదైనా లవ్ స్టొరీ చెప్తారేమో అనుకున్నాను. హరోం హర కథ చెప్పిన తర్వాత చిన్న షాక్ కి గురయ్యాను. తర్వాత సెహరి చూశాను. సెహరి తన కథ కాకపోయినా తను పుల్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. పేపర్ మీద వున్నది విజువల్ గా ప్రజెంట్ చేయడం డైరెక్టర్ మెయిన్ క్యాలిటీ. సెహరిని అలా ప్రజెంట్ చేయగలిగారు. హరోం హర వరల్డ్ బిల్డింగ్ తనకి ఇంకా ఈజీ అనిపించింది. తను కుప్పం నుంచే వచ్చారు. జనరల్ గా నాకు కథ నచ్చితే మరో ఆలోచన లేకుండా చేసేస్తాను.
 
-హరోం హర చాలా అథంటిక్ గా చేసిన కమర్షియల్ సినిమా. ఆడియన్స్ కి ఓ కొత్త వరల్డ్ చూసిన ఫీల్ వస్తుంది. ట్రైలర్ చూసి మహేష్ గారు కూడా ఇదే అన్నారు. వరల్డ్ బిల్డింగ్, బ్యాక్ డ్రాప్ ఫ్రెష్ గా వున్న సినిమాలని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చెప్పారు. మహేష్ గారు చాలా ఎక్సయిటెడ్ గా వున్నారు. యాక్షన్ సీన్స్ చాలా బావున్నాయని చెప్పారు.
 
-సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పుడూ యాక్షన్ క్యారెక్టర్స్ చేయమని చెప్పేవారు. ఈ సినిమా అయితే ఆయనకి చాలా నమ్మకంగా చూపించేవాడిని.  
 
గన్ స్మిత్ క్యారెక్టర్ చాలా కొత్తగా వుంది.. దీని గురించి ?
-కమర్షియల్ సినిమా చేసినా కథ నుంచి ఓ హీరో పుట్టడమే నా ప్రయారిటీ. ఇందులో కథలో నుంచే ఒక కమర్శియాలిటీ వుంటుంది. బ్యాక్ డ్రాప్ చాలా ఫ్రెష్ గా వుంటుంది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో తెలుగులో ఏ సినిమా రాలేదని నా ఫీలింగ్. ఇది బిగ్గర్ యూఎస్పీ. జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్ చాలా హెవీ వెపన్స్, గాడ్జెట్స్ తయారు చేస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ మన వూర్లో వుంటే. మన పక్కింటి కుర్రాడిలా తను గన్స్ తయారు చేస్తే కొంచెం నాటుగా రా గా వుంటుంది. దిన్ని జేమ్స్ బాండ్ బ్యాక్ డ్రాప్ ఇన్ కుప్పం అనొచ్చు.
 
-ఇందులో నా క్యారెక్టర్ కి డైలాగ్ మ్యానరిజం వుంటుంది. 'ఇంక సెప్పెదేమ్ లేదు.. సేసేదే' అనే డైలాగ్ సినిమాలో చాలా చోట్ల వస్తుంది.
 
ఈ సినిమాని 80 బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి కారణం ?
-దర్శకుడు ఈ కథని రాసుకున్నపుడు ఆ పిరియడ్ నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఇందులో హీరో ల్యాబ్ అసిస్టెంట్. ఆ రోజుల్లో తనకి గన్ తయారు చేసే నాలెడ్జ్ వుందని చూస్తునపుడు అర్ధమైపోతుంది. 80 బ్యాక్ డ్రాప్ అథంటిసిటీని తీసుకొచ్చింది.  
 
ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా హిట్ అవుతుందనే ఫీలింగ్ ఆడియన్స్ లో వచ్చింది. మీకు ఎలాంటి గట్ ఫీలింగ్ వుంది ?
- ఇప్పటివరకూ కొన్ని తప్పులు చేశాం. కానీ ఇందులో అలాంటి తప్పు  ఒక్కటీ వుండదు. ఇది బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ సినిమా. ఆడియన్స్ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్తారు. ఈ సినిమా చాలా కాన్ఫిడెన్స్ వుంది.  తెలుగులో వచ్చిన టాప్ టెన్ యాక్షన్ సినిమాల్లో హరోం హర వుంటుంది. టాప్ 5 లో వున్నా సర్ ప్రైజ్ అవ్వను. అంత నమ్మకంగా వున్నాం. ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ తో రండి. ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకుంటుంది. యాక్షన్ లవర్స్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. మంచి ఎమోషన్, యాక్షన్ తో అందరికీ నచ్చే సినిమా ఇది.
 
ప్రతి సినిమాకి ఫిజిక్, లుక్ ని చేంజ్ చేయడానికి, లుక్ ని మెంటైన్ చేయడానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తారు ?
-ఫిజిక్ వైజ్ ఈ సినిమాలో చూపించడం లేదు. క్యారెక్టర్ స్ట్రెంత్ కథ నుంచే వస్తుంది. ఇక ప్రతి సినిమాకి ఫిజిక్ విషయంలో తీసుకునే కేర్ గురించి చెప్పాలంటే.,. చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు హీరో అంటే ఇలా వుండాలనే ఓ అభిప్రాయం వుండేది. నేను అలా ఉండటానికి ట్రై చేస్తున్నానంతే. అలాగే క్యారెక్టర్స్ కూడా కొన్ని సార్లు మొటివేట్ చేస్తాయి.
 
హరోం హర టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?
-ఇందులో ఒక గాడ్ లేయర్ కూడా వుంటుంది. ఒక ఊరులో ఓ సమస్య వుంటుంది. ఆ సమస్యని ఓ వ్యక్తి తీరుస్తాడు. ఆయన ఆక్కడి ప్రజలకు దేవుడిలా అనిపిస్తాడు. ఆ వూర్లో అందరూ సుబ్రహ్మణ్యం స్వామి భక్తులు. అలాగే ఇందులో ఓ నెమలి ఎలిమెంట్ కూడా వుంటుంది. అయితే ఇవి కోఇన్సీడెంట్ గా వుంటాయి. షూటింగ్ కోసం కుప్పంతో పాటు అలా కనిపించే లోకేషన్స్ కి వెళ్లాం. మంగులూర్, ఉడిపి, రాజమండ్రిలో షూట్ చేశాం.
 
చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఏం మాట్లాడారు ?
-చంద్రబాబు గారికి కంగ్రాజులేషన్స్ చెప్పాను. కుప్పం బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నాని చెప్పాను. సినిమాలో చెప్పిన'ఇంక సెప్పెదేమ్ లేదు సేసేదే' అనే డైలాగ్ ఇప్పుడైన యాప్ట్ అనిపిస్తే చెప్పండని కూడా అన్నాను (నవ్వుతూ). ఆయన నవ్వేశారు.
 
మీ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ ఇది. ఈ ఒత్తిడి ఉండేదా ? ఫైనల్ అవుట్ పుట్ చూశాక ఏమనిపించింది ?
-ఫైనల్ అవుట్ పుట్ చూశాక ఇప్పటివరకూ ఏ సినిమాకి రాని శాటిస్ఫ్యాక్షన్ వచ్చింది. ఈ సినిమా స్టెప్ లో ఇంత భారీగా తీసున్నామా అనిపించేది. కలర్ పేలట్ చూసిన తర్వాత చాలా కొత్తగా అనిపించింది. ఫైనల్ పుట్ పుట్ చూశాక అద్భుతం అనిపించింది. టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా వుంటుంది. అవుట్ పుట్ చూశాక దర్శకుడికి వందకు వంద మార్కులు వేయాల్సిందే. ట్రైలర్ చూసినప్పుడు ఆడియన్స్ ఎంత ఎఫెక్టివ్ గా ఫీలయ్యారో సినిమా చూసినప్పుడు కూడా అంతే ఎఫెక్టివ్ గా సర్ ప్రైజింగ్ గా వుంటుంది.
 
హరోం హరకి సీక్వెల్ ఉందా ?
-హరోం హర కి ఆ స్కోప్ వుంది. అయితే అది వచ్చే రిజల్ట్, ఆడియన్స్ కోరే దాని బట్టి వుంటుంది.
 
ఇందులో సునీల్ గారి క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
-ఆయన సస్పెండెడ్ పోలీస్ కానిస్టేబుల్ గా కనిపిస్తారు. సుబ్రమణ్యం క్యారెక్టర్ కి బ్యాక్ బోన్. పుల్ లెంత్ క్యారెక్టర్. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన రోల్స్ లో ఇది స్ట్రాంగ్ రోల్.  
 
మాళవిక క్యారెక్టర్ గురించి ?
తను చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. భాష నేర్చుకొని నటించడం అంత తేలిక కాదు. తను చాలా ఎమోషనల్ గా చేసింది.
 
ప్రొడక్షన్ హౌస్ గురించి ?
సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ప్రొడ్యూసర్స్ స్టొరీ మార్కెట్ ని బట్టి సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ నిర్మించారు. చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్స్.
 
చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ గురించి ?
చేతన్  భరద్వాజ్ మరో అనిరుద్ లా సెట్ అయిపోతాడు. విక్రమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఎంత సపోర్ట్ చేసిందో.. ఈ సినిమాకి చేతన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత బలాన్ని ఇస్తుంది. ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ఆడియన్స్ కి గుర్తుండిపోతుంది. దీనికి మెయిన్ రీజన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.
 
హరోం హర, మా నాన్న సూపర్ హీరో సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకున్నాయి కదా.. ఎలా బ్యాలెన్స్ చేశారు ?
-క్యారెక్టర్స్ ని లోతుగా అండర్ స్టాండ్ చేసుకుని ఫిగర్ అవుట్ చేసుకుంటే పోట్రేట్ చేయడం ఈజీనే.