ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శనివారం, 4 మే 2019 (15:12 IST)

చార్మికి ఇదేం కోరికో? త్రిషను పెళ్లాడుతుందట, చట్టపరంగా కూడా అది లీగల్ అంటూ...

త్రిష పుట్టినరోజు వచ్చిన ప్రతిసారీ చార్మి ఇదేటైపు ట్వీట్ చేయడం జరుగుతోంది. ఈసారి కూడా సేమ్ టు సేమ్ అలాంటి ట్వీటే. 'బేబీ ఐ లవ్ యూ టుడే అండ్ ఫరెవర్. నీ వద్ద మోకరిల్లు మరీ అడుగుతున్నా, దయచేసి నన్ను పెళ్లి చేసుకోవూ. చట్టపరంగా కూడా మనం పెళ్లి చేసుకుంటే ఎలాంటి అడ్డంకి లేదు కాబట్టి ప్లీజ్ నన్ను పెళ్లాడు' అంటూ ట్వీట్ పెట్టింది. 
 
ఇకపోతే 'పౌర్ణమి' చిత్రంలో త్రిషకు చెల్లెలిగా చార్మి నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చాన్స్ దొరికితే త్రిష వద్దకు వెళ్తుందట చార్మి. మరి ఎందుకు వెళుతుందో ఏం చేస్తుందో తెలియదు కానీ తాజా ట్వీట్ దెబ్బకు నెటిజన్లు షాకవుతున్నారు. మరి నిజంగానే త్రిష, చార్మిని పెళ్లి చేసుకుంటుందేమో?