గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (13:38 IST)

అలాంటివి ఎప్పటికీ చేయనంటున్న ఛార్మీ

టాలీవుడ్ ప్రేక్షకులు పెద్దగా మర్చిపోలేని పేరు చార్మింగ్ గర్ల్ ఛార్మి. టాలీవుడ్‌లో నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు వంటి సీనియర్ హీరోల పక్కనే కాకుండా ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్ వంటి యంగ్ స్టార్‌లతోనూ జోడీ కట్టేసింది. ఈ భామ ప్రస్తుతం తెరపై కనిపించడం మానేసి తెర వెనుక బాధ్యతలనే నిర్వరిస్తూ "ఇస్మార్ట్ శంకర్" రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 50కిపైగా సినిమాలలో నటించి తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఛార్మీ ప్రస్తుతం హీరోయిన్‌గా కంటే నిర్మాతగానే బిజీ బిజీగా ఉంటోంది.
 
ఈ నేపథ్యంలో ఆవిడ రీఎంట్రీని గురించి ప్రశ్నించినప్పుడు ఆవిడ మాట్లాడుతూ... 'జ్యోతిలక్ష్మి' చిత్రంతోనే హీరోయిన్‌గా తాను రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నట్లు... కానీ ఆ సినిమా నిర్మాత కళ్యాణ్ వారించడంతో ఆగిపోయినట్లు చెప్పుకొచ్చింది. వయసు మీరిన హీరోయిన్లందరూ చేసేలా మీరు కూడా అక్క, వదిన వంటి పాత్రలు చేయవచ్చుగా అన్నప్పుడు.... తాను అందుకే వద్దనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఛార్మీ అంటే ఇలాగే వుండిపోవాలి. అంతే కానీ అక్క, వదిన క్యారెక్టర్లకు ఎవరైనా అడిగితే ఎప్పటికీ చేయనంటూ సమాధానం తేల్చిచెప్పింది.