శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (13:21 IST)

పూరీతో బాగా క్లిక్ అయిన ఛార్మి... పురుషుల బట్టల వ్యాపారం స్టార్ట్

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో సీనియర్ హీరోయిన్ చార్మీ కౌర్ బాగా కనెక్ట్ అయినట్టున్నారు. ఇప్పటికే పూరీ సొంత నిర్మాణ సంస్థ పూరి టూరింగ్ టాకీస్ నిర్మాణ వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తోంది. తాజాగా పూరి కనెక్ట్ పేరుతో మరో సంస్థను ప్రారంభించింది. దీని ద్వారా కొత్త హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేస్తోంది. 
 
ఇపుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి చార్మీ సరికొత్త వ్యాపారం స్టార్ట్ చేశారు. ఆ వ్యాపార‌మే ఆన్‌లైన్‌లో బ‌ట్ట‌ల‌ను అమ్మ‌డం. ఇందులో మ‌గ‌వారి దుస్తుల‌నే అమ్ముతార‌ట‌. ఈ విష‌యాన్ని ఛార్మి త‌న ట్విట్ట‌ర్ ద్వారా చార్మి వెల్లడించింది. 
 
ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారట. ఈ వెబ్‌సైట్ ద్వారా ముందుగా ఆర్డర్ ఇచ్చిన వారికి 30 శాం మేరకు రాయితీ ఇస్తారట. ఈ విషయాన్ని "ఇస్మార్ట్ శంకర్" ప్రి రిలీజ్ వేజుక వేదికపై నుంచి చార్మి ప్రకటిచించింది.