బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (15:49 IST)

మంత్రి అయ్యన్నపాత్రుడును ఓడించిన పూరీ జగన్నాథ్ సోదరుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా కేవలం ముగ్గురు మినహా 15 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. ఇలాంటివారిలో మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు కూడా ఉన్నారు. ఈయన్ను ఓడించింది ఎవరో కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడైన మెట్ల ఉమాశంకర్ గణేశ్. గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఈయన.. ఈ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
 
మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ ఎన్నికల్లో విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఇదే స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ పోటీ చేశారు. నిజానికి గణేశ్‌కు మంత్రి అయ్యన్నపాత్రుడు రాజకీయ గురువు. కానీ, రాజకీయాలంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. 
 
ఈ ఎన్నికల్లో పూరీ సోదరుడుకు 90,077 ఓట్లు పోలుకాగా, అయ్యన్నపాత్రుడుకు 67,777 ఓట్లు వచ్చాయి. దీంతో మంత్రి అయ్యన్నపాత్రుడు తన శిష్యుడు చేతిలో ఓడిపోయాడు. గత ఎన్నికల్లో ఓడిపోయాడన్న సానుభూతితో పాటు.. జగన్ ఛరిష్మా కూడా ఆయనకు కలిసొచ్చి విజయభేరీ మోగించి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి అడుగుపెట్టనున్నరు.