ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (20:00 IST)

పాయల్ రాజ్ పుత్‌కు పట్టరాని కోపం.. లగేజీని విసిరేశారని..

Payal Rajput
Payal Rajput
అందాల పాయల్ రాజ్ పుత్‌కు పట్టరాని కోపం వచ్చింది. ఆర్ఎక్స్-100తో పరిచయం అయిన పాయల్ తన అందంతో అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. ప్రస్తుతం మంచు విష్ణుతో జిన్నా అనే చేస్తోంది. ఈ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన ఓ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది.
 
ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ తీరుపై మండిపడింది పాయల్. ఇటీవలే ఇండిగో విమానంలో పాయల్ రాజ్‌పుత్‌ ప్రయాణించింది. ఈ సందర్భంగా తన లగేజీని ఇండిగో విమాన సిబ్బంది ఇష్టానుసారంగా విసిరేశారని పేర్కొంది. తన లగేజ్‌ను నిర్లక్ష్యంగా విసిరిపారేశారట. 
 
దీంతో తన లగేజీ డ్యామేజీ అయ్యిందని చెప్పుకొచ్చిన పాయల్… ఈ ప్రయాణం తనకు ఎన్నడూ ఎదురవని చేదు అనుభవాన్ని మిగిల్చిందని పేర్కొంది. అలాగే డ్యామేజ్ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది.