బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (15:48 IST)

'పెళ్లిసందD' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా చిరు - వెంకీ

టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రోషన్, శ్రీలీల జంటగా గౌరి రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పెళ్లిసందD'. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. దసరా పండుగ కానుకగా అక్టోబరు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పైగా, ఈ చిత్రంలో మౌనమునిగా గుర్తింపు పొందిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు కీలక పాత్రను పోషించారు. 
 
ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 10న హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేశ్ వస్తున్నారు. 
 
'పెళ్లిసందD' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలుస్తోంది. రేపు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమం షురూ కానుంది. 'పెళ్లిసందD' చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, పాటలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది.