గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:57 IST)

ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కొండపొలం' ... నచ్చిదంటున్న చిరంజీవి

Kondapolam
ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రెండో చిత్రం "కొండపొలం". క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. సాయిబాబు, రాజీవ్ రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 
ఈ సినిమా ప్రీమియర్ చూసిన చిరంజీవి, వెంటనే ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. 'కొండపొలం' సినిమా ఇప్పుడే చూశాను.. నాకు చాలా బాగా నచ్చింది. పవర్ఫుల్ సందేశంతో కూడిన అందమైన గ్రామీణ ప్రేమకథ ఇది. క్రిష్ ఎప్పుడూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఉంటారు.
 
నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకునే సత్తా ఆయనకి ఉంది. తప్పకుండా ఈ సినిమా ఎన్నో ప్రశంసలను అందుకుంటుందనీ.. ఎన్నో అవార్డులను గెలుచుకుంటుందని ఆశిస్తున్నాను' అని రాసుకొచ్చారు. ఒక సామాన్యుడిగా అడవిలో ఇబ్బందులు పడిన ఒక యువకుడు, అడవిని సంరక్షించే అధికారిగా తిరిగి రావడమే ఈ కథ సారాంశం.