1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 22 జూన్ 2024 (16:30 IST)

ట్యాలెంటెడ్ యాక్టర్ ఎన్టీఆర్ అంటూ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ కితాబు

Bosco Martis,Tarak
Bosco Martis,Tarak
మాస్, యాక్షన్ సినిమాగా రూపొందుతోన్న ఎన్.టి.ఆర్. దేవర సినిమా దాదాపు ముప్పావు వంతు షూటింగ్ పూర్తయింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ నాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లోని పాటకు కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ సాంగ్ చేశాడు. ఈ సందర్భంగా ఓ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
 
ఇటీవల దేవర షూటింగ్ కోసం ఎన్టీఆర్ థాయిలాండ్ వెళ్ళారు. అక్కడ సాంగ్ షూట్ చేసినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ,న ఎట్టకేలకు వెరీ ట్యాలెంటెడ్ యాక్టర్ ఎన్టీఆర్ గారితో దేవరకు వర్క్ చేస్తున్నాము అని పేర్కొన్నాడు. 
 
దేవర చిత్రం రెండు పార్ట్ లుగా చిత్రీకరణ జరుగుతోంది. మొదటి పార్ట్ ను  సెప్టెంబర్ 27 న విడుదల చేస్తున్నారు.  ఇదిలా వుండగా, మరో వైపు బాలీవుడ్ లో వార్ 2 అనే సినిమా కూడా ఎన్.టి.ఆర్. చేస్తున్నాడు.