శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (19:43 IST)

'యాత్ర -2': అచ్చుగుద్దినట్టు జగన్ మాదిరిగా జీవా..

Yatra 2
Yatra 2
'యాత్ర' సినిమాకు దర్శకత్వం వహించిన మహీ వి రాఘవ..'యాత్ర -2' కూడా దర్శకత్వం వహిస్తున్నారు. జగన్ పాత్రను తమిళ హీరో జీవా పోషిస్తున్నారు. సీక్వెల్‌లో జగన్ ఓదార్పు యాత్ర, వైసీపీ ఆవిర్భావం, పాదయాత్ర, భారీ మెజారిటీతో జగన్ సీఎం కావడం తదితర అంశాల్ని చూపించబోతున్నారని ఈ పోస్టర్స్‌ని చూస్తేనే అర్థం అవుతుంది. 
 
యాత్ర -2 సినిమాను 2024 ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం యాత్ర- 2కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టర్స్‌లో జీవా అచ్చుగుద్దినట్టు జగన్ మాదిరిగా ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.