గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (19:20 IST)

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్‌కు తీవ్ర అనారోగ్యం

తెలుగు చిత్రసీమలో హాస్యనటుడిగా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. వేణు మాధవ్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సాంప్రదాయంతో ఎంట్రీ ఇచ్చారు.
 
అయితే తొలిప్రేమ సినిమాలో అమ్మాయిల పై ఆయన చెప్పిన చాటభారతమంత డైలాగ్ ఆయన్ను ప్రేక్షకులకు బాగా చేరువ చేసింది. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఆపై సై, ఛత్రపతి వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల కాలేయ సంబంధిత సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్ యశోదా హాస్పటల్ లో చేరారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.