సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (15:18 IST)

ర‌జ‌నీకాంత్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ

Mohabnbabu, Rajani
సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు ద‌క్క‌డం ప‌ట్ల తెలుగు సినిమా రంగం ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, మ‌హేష్‌బాబుతోపాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఆయ‌న అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ సోష‌ల్‌మీడియాలో పేర్కొన్నారు.

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పందిస్తూ.. 30 ఏళ్ళ క్రితం అన్న‌య్య చిరంజీవితో క‌లిసి బందిపోటు సింహం, కాశీ చిత్రాలు ఇప్ప‌టికీ నాకు గుర్తే. 430 ఏళ్లుగా త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న ర‌జ‌నీ ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హులు. ర‌జ‌నీగారు మ‌రిన్ని చిత్రాలు న‌టిస్తూ ఇంకా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాల‌ని కోరుకుంటున్నాని తెలిపారు. ఇంకా సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్‌తోపాటు ప‌లు నిర్మాణ‌సంస్థ‌లు కూడా ర‌జ‌నీకి ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హులంటూ పేర్కొన్నారు.
 
నాకు గ‌ర్వంగా వుందిః మోహ‌న్‌బాబు
నా ఫ్రెండ్‌కు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావ‌డం గ‌ర్వంగా వుంద‌ని మోహ‌న్‌బాబు ట్వీట్ చేశాడు. ద‌క్షిణభార‌త‌దేశంలో గ‌ర్వించ‌ద‌గిన న‌టుడు ర‌జ‌నీ అంటూ ఆయ‌న‌తో షూటింగ్‌లో వున్న ఫొటోను షేర్ చేశాడు. ఇదేవిధంగా మంచు విష్ణుకూడా శుభాకాంక్ష‌లు తెలిపారు.