1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (16:36 IST)

క్రేజీ ఫెలో ప్రేక్షకుల అభిమానం పొందడం అనందంగా వుంది, చిత్ర యూనిట్

Adi Saikumar, KK Radhamohan,  Phani Krishna Siriki, Digangana Suryavanshi, Mirna Menon,
Adi Saikumar, KK Radhamohan, Phani Krishna Siriki, Digangana Suryavanshi, Mirna Menon,
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణంలో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'క్రేజీ ఫెలో'.  దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న  విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ శ‌నివారంనాడు త‌మ ఆనందాన్ని ఇలా వ్య‌క్తం చేస్తున్నారు. 
 
హీరో ఆది మాట్లాడుతూ..  క్రేజీ ఫెలోకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి రివ్యూలు వస్తున్నాయి. మౌత్ టాక్ అద్భుతంగా వుంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చేశాను. నిర్మాత రాధమోహన్ గారు ఎక్కడ రాజీ పడకుండా తీశారు. దర్శకుడు ఫణి కృష్ణ కథని చాలా ప్రేమించి ఈ సినిమా తీశారు. డీవోపీ సతీష్ ముత్యాల, మ్యూజిక్ డైరక్టర్ ద్రువన్.. ఇలా అందరూ మంచి వర్క్ ఇచ్చారు. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ పాత్రలు చక్కగా చేశారు. నర్రా శ్రీనివాస్, సప్తగిరి, ప్రమోదిని, అనీష్ కురివిల్లా .. అందరితో కలసి నటించడం ఆనందంగా వుంది. ఒక మంచి సినిమా చేశాం. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి''అని కోరారు.
 
దిగంగన సూర్యవంశి మాట్లాడుతూ.. క్రేజీ ఫెలో నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నిర్మాత రాధామోహన్ గారికి కృతజ్ఞతలు. హీరో ఆది గారితో పని చేయడం అనందంగా వుంది. చాలా ఎనర్జిటిక్ యాక్టర్. దర్శకుడు ఫణి గారు చాలా క్లారిటీ వున్న దర్శకుడు.  డీవోపీ సతీష్ గారు చాలా అందంగా చూపించారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు.  సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అందరూ సినిమాని థియేటర్ లో చూడాలి'' అని కోరారు.
 
మిర్నా మీనన్ మాట్లాడుతూ..చాలా మంచి పాత్ర ఇచ్చారు. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ వస్తోంది. ఆది గారితో నటించడం ఆనందంగా వుంది. దిగంగన చక్కగా నటించింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాకి మంచి విజయం ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' తెలిపారు.
 
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. క్రేజీ ఫెలో కోసం మంచి టీం వర్క్ చేశాం. ఈ విజయం అందరి సమిష్టి కృషి. క్రేజీ ఫెలో ప్రేక్షకుల అభిమానం పొందడం చాలా అనందంగా వుంది. క్రేజీ ఫెలో క్లీన్  ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ కూర్చిని హాయిగా థియేటర్ లో ఎంజాయ్ చేసే సినిమా ఇది. మా బ్యానర్ ద్వారా ఆదికి మంచి సక్సెస్ ఇచ్చినందుకు ఆనందంగా వుంది. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ చక్కగా నటించారు. ఫణి కృష్ణ ఈ సినిమాతో తన ప్రతిభ చాటుకున్నారు. తనని మా బ్యానర్ లో పరిచయం చేయడం ఆనందంగా వుంది. ద్రువన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ప్రేక్షకులు అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి'' అని కోరారు.
 
దర్శకుడు ఫణి కృష్ణ మాట్లాడుతూ.. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారని క్రేజీ ఫెలో తో మరోసారి రుజువు చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మార్నింగ్,  ఈవినింగ్ షోకి మంచి గ్రోత్ వుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రాధమోహన్, హీరో ఆది గారికి కృతజ్ఞతలు. సినిమా కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సినిమాకి మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' తెలిపారు.
 
నర్రా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన  దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' తెలిపారు.
 
సతీష్ ముత్యాల మాట్లాడుతూ.. క్రేజీ ఫెలో ని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. ఆది, ఫణి కృష్ణ, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం మంచి టీం వర్క్ చేశాం. ఈ సినిమాకి ఘన విజయం ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు'' తెలిపారు . ఈ కార్యక్రమంలో నవీన్, జిత్తు, దీపు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.