1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 మే 2024 (19:06 IST)

డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్ కు పోలీస్ పర్మిషన్ రద్దు

Director's Day celebrations  Invitation
Director's Day celebrations Invitation
దాసరి నారాయణరావుగారి జయంతి నాడు తెలుగు సినీ యావత్తు ఏర్పాటు చేయాలనుకున్న డైరెక్టర్స్ డే ఫంక్షన్ కు పోలీసుడు గండి కొట్టారు. ఇంకా మూడు రోజులు సమయం వుందనగా, నేడు పర్మిషన్ రద్దు చేశారు. ఇప్పటికీ పలువురు ప్రముఖులను డైరెక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిలుపు వెళ్ళాయి. ఇందుకు ప్రభాస్ దాదాపు ముప్ప నాలుగు లక్షలు ఫండ్ కూడా ఇచ్చాడు. అయితే ఒకవైపు హైదరాబాద్ లో ఎండల తీవ్రత అధికంగా వుండడంతోపాటు వడగాలులు వీచడంతో ఓపెన్ ప్లేస్ లో ఫంక్షన్ జరుగుతుందా? లేదా? అనే సంశయనం చాలా మందిలో వుంది.
 
మే 4 వ తేదీన   తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఎల్  బీ స్టేడియం లో ఘనంగా నిర్వహించతలబెట్టిన "డైరెక్టర్స్ డే" సెలెబ్రేషన్స్  కొత్తగా షెడ్యూల్ అయిన ప్రముఖ నాయకుల కార్యక్రమాల కారణంగా  పోలీస్ లా అండ్ ఆర్డర్ వారు  పర్మిషన్ ని  రద్దుచేయడం జరిగింది 
 
దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది మే 4 న డైరెక్టర్స్ డే గా గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే . మరో రెండు రోజులలో   ఈ కార్యక్రమం మరలా ఏ తేదీన  నిర్వహించేది తెలియచేస్తామని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీరశంకర్,  జనరల్ సెక్రటరీ  సి హెచ్ సుబ్బారెడ్డి తెలియజేసారు.